Ivana: లవ్ టుడే లవ్లీ బ్యూటీ.. ఇవానా పాప అసలు ఏమైపోయింది..
ఇవానా నటించిన నాచియార్ అనే సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో జాన్సీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో జోతిక ప్రధాన పాత్రలో నటించగా ఇవానా సహాయక పాత్రలో నటించింది. అలాగే లవ్ టుడే సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది.