Basha Shek |
Jan 12, 2023 | 8:34 PM
ప్రముఖనటి హన్సిక మోత్వాని 2022లో వివాహం చేసుకుంది. ఇప్పుడు తన భర్త సోహైల్ కతురియాతో కలిసి ఈజిప్ట్‌కు హనీమూన్ వెళ్లింది.
హన్సిక, సోహైల్ మంచి స్నేహితులు. వీరిద్దరూ వ్యాపార రంగంలో మంచి భాగస్వామ్యులు. ఇప్పుడు పెళ్లితో జీవితంలోనూ పార్ట్‌నర్స్‌గా మారిపోయారు.
తాజాగా ఈజిఫ్టు పర్యటనకు వెళ్లారు హన్సిక దంపతులు. ఈ సందర్భంగా తమ వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారీ క్యూట్ కపుల్.
సోషల్ మీడియాలో హన్సికకు ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 56 లక్షల మంది ఫాలో అవుతున్నారు.
తెలుగులో బన్నీ సరసన దేశముదురు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది హన్సిక. ఆ తర్వాత దక్షిణాది ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.