
బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయినా బ్యూటీస్ లో దివి ఒకరు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన దివి బిగ్ బాస్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

బిగ్ బాస్ లో తనదైన ఆటతో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంది దివి. అందం అభినయం ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి అలరించింది. చేసింది చిన్న పాత్రే అయినా తన నటనతో ఆకట్టుకుంది.

అయితే బిగ్ బాస్ తర్వాత దివి కి వరుస ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది.

ఇక సోషల్ మీడియాతో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉండే దివి. గ్లామరస్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేసింది.