
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే హీరోయిన్లలో భూమి పెడ్నేకర్ ఒకరు. తన అందం, అభినయంతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుందీ అమ్మడు.

ఇక సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్‌కు ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.

భూమి నెట్టింట షేర్ చేసే ఫొటోలకు నెటిజన్లు నుంచి మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా తన స్పెషల్ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిందామె. ఇందులో వైట్ డ్రెస్ ధరించిన ఆమె మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది.

2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం ఆమె చేతిలో భక్షక్, ది లేడీ కిల్లర్, మేరీ పత్నీకా రీమేక్ తదితర సినిమాలున్నాయి.