Anikha Surendran: ఆ విషయంలో రిస్క్ చేస్తోన్న అనిక.. అయినా ఆ హీరోయిన్ను పట్టించుకోరేంటీ.. ?
కోలీవుడ్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమాతో బాలనటిగా గుర్తింపు తెచ్చుకుంది అనికా సురేందర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించింది. కానీ అజిత్ నటించిన ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాలతోనే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తమిళంలో, తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. చాలా మంది బాలతారల మాదిరిగానే ఇప్పుడు అనిక హీరోయిన్ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పటికే బుట్టబొమ్మ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి కథానాయికగా అడుగుపెట్టింది.