
బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనికా సురేంద్రన్, ప్రస్తుతం దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రధాన కథానాయికగా తనదైన ముద్ర వేసింది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా అలరిస్తుంది. అలాగే తెలుగు, తమిళంలో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది ఈ అమ్మడు.

తమిళంలో అత్యధిక చిత్రాల్లో నటించింది. విశ్వాసం, ఎన్నై అరిందాల్ వంటి చిత్రాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఈ రెండు సినిమాల్లో ఆమె అజిత్ కూతురిగా కనిపించింది. చిన్నవయసులోనే బాలనటిగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. బుట్టబొమ్మ మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్టు కాకపోయినా నటిగా ప్రశంసలు అందుకుంది అనికా. ఆ తర్వాత ఓ మై డార్లింగ్ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది.

ధనుష్ తెరకెక్కించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎనాడి కోపం (తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా) సినిమాతో కథానాయికగా హిట్టు అందుకుంది. ఆ తర్వాత ఇందిరా చిత్రంలో కనిపించింది. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనికా.. ఇప్పుడు చీరకట్టులో అందమైన ఫోటోస్ షేర్ చేసింది. సింపుల్ శారీ, జుంకాలతో కట్టిపడేస్తుంది అనికా. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.