అవ్వడానికి తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్ సినిమాలతో పాపులర్ అయ్యింది ఐశ్వర్య రాజేష్. తమిళ్ లోనే హీరోయిన్ గా సినిమాలు చేసి ఆతర్వాత తెలుగులోకి అడుగు పెట్టింది ఈ టాలెంటెడ్ నటి.కౌసల్య కృష్ణ మూర్తి అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైనా ఐశ్వర్య రాజేష్. వరుసగా సినిమాలు చేస్తూ అలరించింది. అలాగే పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గాను నటించింది. టాక్ జగదీశ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి సినిమాల్లో నటించింది.