ప్రస్తుతం పింక్ లెహంగాలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది.
ఆ వయ్యారి మరెవరో కాదు. హీరోయిన్ ఐశ్వర్యలక్ష్మి. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి గాడ్సే సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో అందం, అభినయంతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
ఆ తర్వాత అమ్ము, పొన్నియన్ సెల్వన్, కుమారి, కింగ్ ఆఫ్ కొత్త, మట్టి కుస్తీ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ సరసన సంబరాల ఏటిగట్టు అనే మూవీలో నటిస్తుంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ కుర్రకారును కట్టిపడేస్తున్నాయి.
పింక్ కలర్ డ్రెస్ వేసుకుని హాట్ స్టిల్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చింది. 'స్టే మ్యాయిట్యూరేటర్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్' అంటూ క్యాప్షన్ సైతం రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.