తమిళ సినీ ప్రముఖ జంట విజయకుమార్-మంజుల చిన్న కుమార్తె శ్రీదేవి విజయకుమార్. తమిళ చిత్రసీమలో పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి..ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి చిత్రానికే హిట్ అందుకున్న శ్రీదేవి.. ఈ సినిమాతో తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.