
లెజెండరీ సింగర్ పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ తల్లిదండ్రులు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. తండ్రి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ సినిమాల్లో పాటలు ఆలపించారు.

ఇలా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సాయికిరణ్ కూడా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

'నువ్వే కావాలి' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సాయి కిరణ్. ఆ తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో' తదితర చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు.

కొన్ని సినిమాల్లోనూ సహాయక నటుడిగానూ మెప్పించిన సాయి కిరణ్ ఇప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి

సినిమాలు, సీరియల్స్ సంగతి పక్కన పెడితే.. 2010లోనే సాయికిరణ్‌కి ఆల్రెడీ వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లయిందని, ఓ పాప కూడా ఉందని తెలుస్తోంది. అయితే వీరిద్దరూ విడిపోయారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు సాయికిరణ్. ఇప్పుడు వీరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి.