
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నాడు. ఆయనతో భార్య, కూతురు దివిజా ప్రభాకర్ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు.

తమ అరుణాచల యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది దివిజ. ఇందులో చాలా మెడలో పూలమాల వేసుకుని ఎంతో ట్రెడిషనల్ గా కనిపించింది దివిజ

ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక దివిజా ప్రభాకర్ విషయానికి వస్తే.. సోదరుడు చంద్రహాస్ నటించిన రామ్ నగర్ బన్నీ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించింది.

అలాగే ఇటీవల బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన బ్రహ్మ ఆనందం మూవీలోనూ ఓ ప్రధాన పాత్రలో తళుక్కుమంది.

ప్రస్తుతం హే చికిత్తా మూవీలో హీరోయిన్ గా నటిస్తోందీ అందాల తార. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.