
వరుసగా ఎక్స్‌పరిమెంట్ మూవీస్ చేస్తున్న జూనియర్ బచ్చన్, త్వరలో ఐ వాంట్ టు టాక్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ సినిమాలో అభిషేక్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ లుక్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు చోటా బీ.

కమర్షియల్ జానర్‌కు ఎప్పుడో గుడ్‌బై చెప్పిన అభిషేక్ బచ్చన్, వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నారు. ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్న అభి, త్వరలో ఐ వాంట్ టు టాక్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో అనారోగ్యంతో ఇబ్బంది పడే వ్యక్తిగా భారీకాయంతో కనిపిస్తున్నారు అభిషేక్. మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సమయంలో ప్రోస్తెటిక్ మేకప్‌తో అభిషేక్‌ను అలా చూపించారని భావించారు ఫ్యాన్స్.

కానీ రీసెంట్‌గా ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొన్న హీరో, అసలు విషయం రివీల్ చేశారు. సినిమా కోసం నిజంగానే బరువు పెరిగానని, ఎంత కష్టపడి పొట్ట పెంచానని చెప్పారు.

ఐ వాంట్ టు టాక్ సినిమా కోసం రిస్క్ చేసిన అభిషేక్, భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి రిస్క్ చేయనని తేల్చి చెప్పేశారు. ఈ వయసులో బరువు పెరిగి తగ్గటం అంటే మామూలు విషయం కాదు, ఇక ముందు ఇవి సాధ్యపడకపోవచ్చు, అందుకే ఫిజికల్ ట్రాన్సఫర్మేషన్ విషయంలో రిస్క్ చేయనని చెప్పారు.