
ఐఎండీబీ రిలీజ్ చేసిన మోస్ట్ అవెటెడ్ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి కేవలం మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. సిక్త్స్ ప్లేస్‌లో ది రాజాసాబ్, లెవెన్త్ ప్లేస్‌లో కన్నప్ప, ట్వంటీయత్ ప్లేస్‌లో తండేల్ మూవీస్ ఉన్నాయి.

మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్‌కు రెడీ అవుతున్నా... అవి లిస్ట్‌లో కనిపించకపోవటం మీద ఫిలిం సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.

సోషల్ మీడియాలో ఈ సినిమాల ట్రెండ్స్ భారీగానే కనిపిస్తున్నాయి. అయినా మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్‌లో మాత్రం పవన్ సినిమాకు ప్లేస్ దక్కలేదు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ విశ్వంభర మీద కూడా అదే రేంజ్‌లో బజ్ ఉన్నా... ఐఎండీబీ లిస్ట్‌లో ఆ సినిమా కనిపించలేదు. కేవలం హిందీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఐఎండీబీ మోస్ట్ అవెయిటెడ్ లిస్ట్ తయారు చేసినట్టుగా ఉంది అంటున్నారు సౌత్ ఆడియన్స్.

ఈ లిస్ట్‌లో సల్మాన్ సికందర్ నెంబర్ వన్ ప్లేస్‌లో ఉండగా... టాక్సిక్, కూలీ సినిమాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఏ మాత్రం బజ్ లేని హౌస్‌ఫుల్ 5, బాగీ 4 సినిమాలు టాప్ 5లో ప్లేస్ దక్కించుకున్నాయి.