Permanent Pathway for Divyangjan
-
-
చెన్నైలోని మెరీనా బీచ్ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. చెన్నై వెళ్లే చాలామంది ఈ బీచ్‌ను తప్పకుండా సందర్శిస్తారు. అయితే బీచ్ మొత్తం ఇసుకతో నిండి ఉండటంతో దివ్యాంగులు బీచ్‌ను సందర్శించడం వీలుకాదు. దీంతో దివ్యాంగుల కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక శాశ్వత మార్గాన్ని ఏర్పాటుచేసింది.
-
-
మెరీనా బీచ్‌లో దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన శాశ్వత మార్గాన్ని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) ఏర్పాటు చేయగా.. ఈ సదుపాయాన్ని తమిళనాడు రాష్ట్ర మంత్రలు కెఎన్నెహ్రూ, సుబ్రమణియన్, పికె శేఖర్ బాబు, పార్లమెంటు సభ్యుడు దయానిధి మారన్, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు.
-
-
దివ్యాంగులు సముద్రాన్ని వీక్షించడానికి ఈ ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కన్జర్వేన్సీ కార్యకలాపాలను మరింత పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మార్గం పొడవునా చెత్త పేరుకుపోకుండా మెకానికల్ క్లీనింగ్ కార్యకలాపాలు ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని ప్రారంభించిన తర్వాత నవంబర్ 27వ తేదీ ఆదివారం మెరీనా బీచ్‌లోని పాత్వే సమీపంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.
-
-
మెరీనా బీచ్‌లో దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన శాశ్వత మార్గాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చాలా మంది కలలు నిజమయ్యాయని, గతంలో తాము వాగ్దానం చేసినట్లుగా దివ్యాంగుల కోసం శాశ్వత మార్గం ఏర్పాటు చేసామన్నారు. తాను ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
-
-
దివ్యాంగుల ఈమార్గంలో సముద్రాన్ని వీక్షించడం కోసం చెన్నై సెంట్రల్ ఎంపీ దయానిధి మారన్ ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ. 4లక్షల 12 వేలతో కొనుగోలు చేసిన ఆరు వాహనాలను ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు.
ఈ మార్గంలో సాధారణ ప్రజలు వెళ్లవద్దని, రైలింగ్‌పై కూర్చోవద్దని సూచించారు. బీచ్‌లో తిరిగి సముద్రాన్ని వీక్షించాలనుకునే ఎంతో మంది దివ్యాంగులకు ఈమార్గం ఉపయోగపడనుంది.
మరిన్ని వార్తల కోసం చూడండి..