చాలా మంది ఉదయాన్నే కప్పు కాఫీ తాగనది ఉండలేరు. అయితే.. కాఫీ ఉదయాన్నే తాగితే.. గ్యాస్ట్రిన్ విడుదలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కడుపులో ఉత్పత్తి చేసే హార్మోన్ వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. జీర్ణాశయం, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల కడుపులో వికారం, గ్యాస్, మంట లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.ఎక్కువగా కాఫీ తీసుకోవడం వల్ల రొమ్ములో చిన్న చిన్న గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాఫీ వల్ల శరీరంలో నీరు తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి, చర్మనికి, జుట్టుకు మంచిది కాదు.