
అందమైన జుట్టు ఉండాలని అందరూ కోరకుంటారు. కానీ వారిలో ఉండే హార్మోనల్ బ్యాలెన్స్, ఆహార సమతుల్యత, ఒత్తిడి ఇలా అనేక కారణాల వల్ల జుట్టులో మార్పులు వస్తూ ఉంటాయి. జుట్టు రాలడానికి.. చాలా కారణాలు ఉంటాయి. జుట్టు రాలిపోవడం, చుండ్రు, ఎదుగుదల నిలిచి పోవడం, తెల్లగా మారడం ఇలా ఒక్కటేంటి చాలా సమస్యలు ఉంటాయి.

ప్రస్తుతం మారిన జీవన శైలి, కాలుష్యం వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. జుట్టుతోనే అందం అనేది మరింత రెట్టింపు అవుతుంది. ఇప్పటికే మీరు ఎన్నో ప్రోడెక్ట్స్, ఆయిల్స్ ఉపయోగించే ఉంటారు. ఒక్కసారి ఈ ట్రిక్ కూడా ట్రై చేయండి.

నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నెయ్యితో ఇప్పుడు జుట్టు సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు. గోరు వెచ్చటి నెయ్యితో తలకు మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది. దీంతో జుట్టు వేగంగా పెరుగుతుంది. నెయ్యి రాసుకుని హెడ్ బాత్ చేస్తే మీ జుట్టు పట్టు కుచ్చులా ఉంటుంది.

అప్పుడప్పుడు జుట్టుకు నెయ్యి పట్టిస్తూ ఉండటం వల్ల.. జుట్టు రాలడం కూడా కంట్రోల్ అవుతుంది. నెయ్యిలో ఉండే పోషకాలు జుట్టును బలంగా, దృఢంగా చేస్తుంది. అంతే కాకుండా జుట్టు సాఫ్ట్‌గా మెరుస్తూ ఉంటుంది. చుండ్రు కూడా మాయం అవుతుంది.

గోరు వెచ్చటి నెయ్యిని తలకు బాగా పట్టించి ఒక గంట లేదా రాత్రి రాసుకుని ఉదయాన్నే స్నానం చేయాలి. దీంతో నెయ్యిలో ఉండే పోషకాలు జుట్టుకు చేరుతాయి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. వచ్చే ఫలితాలు మీకే కనిపిస్తాయి.