వెదురుతో బుట్టలు, చాపలు, చీపురులతో సహా రోజువారీ గృహావసరాలకు సంబంధించిన అనేక వస్తువులను ఇక్కడి గిరిజన మహిళలు తయారు చేస్తున్నారు. మహాసముంద్ జిల్లాలోని డెవలప్‌మెంట్ బ్లాక్ బాగ్‌బహ్రాలో ఛత్తీస్‌గఢ్ స్టేట్ రూరల్ మిషన్ బిహాన్ కింద సుమారు 11 ప్రత్యేక వెనుకబడిన తెగలు అనుసంధానించబడ్డాయి. ఈ తెగలకు చెందిన మహిళలు వెదురుతో బుట్టలు, బొమ్మలు, చాపలు, చీపుర్లు మొదలైనవాటిని తయారు చేస్తున్నారు. ఇలా తాము తయారు చేసిన వెదురు వస్తువులతో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఇంటిని నిర్వహిస్తున్నారు.