
నేటి కాలంలో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. ఇది శరీరంలోని వివిధ భాగాలలో పక్షవాతం కూడా కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని గడపడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ కింది అలవాట్లు ఉన్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వెంటనే వీటిని మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అధిక రక్తపోటు సమస్యలు ఉన్న వ్యక్తులకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

ధూమపానం వంటి దుర్గుణాలు చాలా ప్రమాదకరం. ధూమపానం చేసేవారికి ఎల్లప్పుడూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. నియంత్రణ లేని మద్యపానం, ధూమపానం చేసేవారు ప్రమాదంలో ఉన్నట్లే.

ఆయిల్, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేని వారు అంటే శరీర కదలిక లేకుండా ఎల్లప్పుడు పడుకుని గడిపే వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.

ఎప్పుడూ ఒత్తిడికి లోనయ్యే వారు, పదే పదే ఆందోళన చెందే వారు కూడా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతారు. మధుమేహాన్ని నియంత్రణలో లేని వారు కూడా ఈ వ్యాధి భారీన పడతారు. రక్తంలో షుగర్ ఎక్కువగా ఉందని తెలియనివారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.