Colour Changes Egret: రంగులు మార్చే పక్షి గురించి మీకు తెలుసా.. అయితే ఇది మీ కోసమే..

|

Jun 06, 2021 | 6:57 PM

రంగులు మార్చడం అంటే గుర్తుకు వచ్చేది కేవలం ఊసరవెల్లి అని తెలుసు. ఇలా దాని స్వభావానికి అనుగుణంగా రకరకాల సామెతలు సృష్టించుకున్నారు.హెరాన్ ఒక పొడుగుచేసిన, కండరాల శరీరాన్ని కలిగి ఉంటుంది.

1 / 6
రంగులను మార్చే పక్షులను మీరు ఎప్పుడైనా చూశారా? ఆశ్చర్యపోకండి! ఇక్కడ  చూడవచ్చు..ఈ పక్షి పేరు కౌ హెరాన్. దీనిని పశువుల ఎగ్రెట్ లేదా బుబుల్కస్ ఐబిస్ అని కూడా పిలుస్తారు. మనం రైలులో... జాతీయ రహదారి పై వెళ్ళినప్పుడు... పొలాల మధ్య ఈ పక్షులను చాలా సార్లు మనకు ఇవి కనిపిస్తుంటాయి. కానీ.. ఇవి రంగులు మార్చుతాయని మాత్రం మనకు తెలియదు..

2 / 6
బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలో ఈ హెరాన్లు చాలా కనిపిస్తున్నాయి. హెరోన్స్ పశువుల మీద కూర్చుని మనకు కనిపిస్తాయి. ఇవి పశువులకు హితకాలరు, మంచి స్నేహితులు అని అంటారు పశువుల వైద్యులు.

3 / 6
ఇవి పశువులకే కాదు రైతులకు కూడా మంచి స్నేహితులని అంటారు వ్యవసాయ పరిశోధకులు. పంటపొలాల్లో ఉండే చీడలను మాత్రమే ఇవి తింటూ అన్నదాతకు సహకరిస్తుంటాయి.

4 / 6
వైట్ హెరాన్‌లో నాలుగు రకాల జాతులు ఉంటాయి. లిటిల్ ఎగ్రెట్, క్యాటెల్ ఎగ్రెట్, ఇంటర్మీడియట్ ఎగ్రెట్, గ్రేట్ ఎగ్రెట్. ఇందులో అన్ని జాతులు కూడా తెలుపు రంగులోనే ఉంటాయి. కానీ సంతానోత్పత్తి  సమయంలో ఆడ హెరాన్ మరో రంగులోకి మారిపోతుంది.

5 / 6
ఇందులో పసుపు, బాదం, నారింజ రంగులో మారుతుంది. సంతానోత్పత్తి కాలం ముగిసిన తర్వాత మళ్ళీ మిల్కీ వైట్ కలర్‌కు వచ్చేస్తాయి.

6 / 6
ఈ హెరాన్ల పక్షులు గుంపులు గుంపులుగా జీవిస్తాయి. కాకుల మాదిరిగా ఇవి కూడా చెట్లపై గూళ్ళు నిర్మించుకుంటాయి. 3 నుంచి 5 తేలికపాటి పాల నీలం గుడ్లు పెడతాయి. కాకి, మైనా, హెరాన్ జాతుల పక్షులతో కలిస చెట్టుపై ఉండటం మనం చూడవచ్చు.