AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాచీ వీరికి డేంజర్.. తింటే ఈ సమస్యలు పక్కా.. ఈ విషయాలను లైట్ తీసుకోవద్దు..

మంచి సువాసన, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని రోజూ యాలకులు నములుతున్నారా? అయితే మీరు తీవ్రమైన ప్రమాదంలో పడ్డట్లే.. అమృతం లాంటి ఔషధ గుణాలున్న యాలకులను మోతాదుకు మించి తింటే కడుపులో మంట, జీర్ణ సమస్యలతో పాటు రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి జరుగుతుందనుకుని తీసుకునే ఈ చిన్న సుగంధ ద్రవ్యం వల్ల శరీరంలో ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Oct 17, 2026 | 3:49 PM

Share
యాలకులు అందరి శరీర తత్వాలకూ సరిపడకపోవచ్చు. ముఖ్యంగా కొందరిలో ఇవి అలెర్జీ సమస్యలకు దారితీస్తాయి. యాలకులు తిన్న తర్వాత చర్మంపై దురదలు రావడం, దద్దుర్లు ఏర్పడటం, గొంతు లేదా ముఖం వాపు రావడం, కొందరిలో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు కలగడం వంటివి అలెర్జీ లక్షణాలుగా బయటపడతాయి. శరీరంలో ఇలాంటి మార్పులు గమనించిన వెంటనే యాలకులను తీసుకోవడం ఆపేసి, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

1 / 5
సాధారణంగా జీర్ణక్రియ బాగుండాలని చాలామంది రోజూ యాలకులు నములుతుంటారు. కానీ వీటిని పరిమితికి మించి తీసుకుంటే వికటించి తీవ్రమైన జీర్ణాశయ సమస్యలకు దారితీస్తుంది. యాలకుల మితిమీరిన వాడకం వల్ల కడుపులో విపరీతమైన గ్యాస్ ఉత్పత్తి అవ్వడం, కడుపుబ్బరం, తీవ్రమైన కడుపునొప్పి, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు సజావుగా సాగాలంటే వీటిని వంటల్లో లేదా నేరుగా తీసుకునేటప్పుడు చాలా మితంగా మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
మరో ప్రధానమైన అంశం రక్తపోటుపై యాలకుల ప్రభావం. యాలకుల్లో సహజంగానే రక్తపోటును తగ్గించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అధిక హై బీపీ ఉన్నవారికి ఎంతో మేలు చేసినప్పటికీ, ఇప్పటికే లో బీపీ సమస్యతో బాధపడేవారికి మాత్రం ప్రమాదకరంగా మారవచ్చు. లో బీపీ ఉన్నవారు యాలకులను ఎక్కువగా తీసుకుంటే వారి రక్తపోటు మరింత ప్రమాదకర స్థాయికి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి వారు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

3 / 5
నిత్యం వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు మందులు వాడుతున్న వారు యాలకుల వాడకంలో జాగ్రత్త వహించాలి. యాలకుల్లో ఉండే కొన్ని క్రియాశీల రసాయన సమ్మేళనాలు మనం వాడే ఔషధాలతో నేరుగా చర్య జరిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్, గుండెజబ్బులు లేదా రక్తం పలుచబడే మందులు వాడేవారు రోజూ యాలకులను డైట్‌లో భాగంగా తీసుకునే ముందు తమ వైద్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి. లేదంటే ఆ మందుల ప్రభావం తగ్గిపోవడమో లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడమో జరుగుతుంది.

4 / 5
హార్మోన్ల అసమతుల్యతతో బాధపడేవారు కూడా యాలకులకు కాస్త దూరంగా ఉండటమే మంచిది. కొన్ని శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం యాలకులు శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేసే లక్షణాలను కలిగి ఉంటాయని తేలింది. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ హార్మోన్ సెన్సిటివ్ రుగ్మతలతో బాధపడే రోగులు వీటిని తీసుకోకపోవడమే మంచిది. సువాసన, ఆరోగ్యం ఇస్తాయి కదా అని మితిమీరి తినకుండా, నిత్యం పరిమిత మోతాదులోనే యాలకులను ఉపయోగించడం వల్ల మాత్రమే పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. (గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, దీర్ఘకాలిక మందులు వాడుతున్నా వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.)

5 / 5
Follow Us