
అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే యవత వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం, థైరాయిడ్, గుండెపోటు, క్యాన్సర్ సంభవం రేటు గత కొన్ని సంవత్సరాలుగా చాలా రెట్లు పెరిగింది. యువతలో ప్రధానంగా క్యాన్సర్ రేటు పెరగడానికిగల ముఖ్య కారణం క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తినడం ద్వారా వ్యాధి కారకాలు నిశ్శబ్దంగా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.

క్యాన్సర్ రాకుండా ఉండాలంటే డైట్ మార్చుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రాణాంతక వ్యాధి ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహారాలకు దూరంగా ఉంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రత్యేకించి, ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలలో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి నైట్రోసమైన్‌లు అని పిలువబడే కార్సినోజెనిక్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. క్యాన్సర్‌కు కారణమైన వాటిల్లో ఇది ఒకటి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం పెద్దప్రేగు క్యాన్సర్‌కు దారితీస్తుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి.

అధిక ఉష్ణోగ్రతల వద్ద రెడ్ మీట్ (మటన్, గొడ్డు మాంసం మొదలైనవి) వండడం వల్ల హెటెరోసైక్లిక్ అమైన్‌లు (హెచ్‌సిఎలు), హైడ్రోకార్బన్‌లు (పిఎహెచ్‌లు) వంటి క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇది పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల రెడ్ మీట్ ఎక్కువగా తింటే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది.

ప్రాసెస్ చేసిన చక్కెర కలిగిన ఆహారాలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతుంది. ఫలితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ప్యాక్ చేసిన జ్యూస్‌లు, శీతల పానీయాలు మొదలైన ప్రాసెస్డ్ షుగర్ ఉన్న పానియాలకు దూరంగా ఉండాలి.

ఎక్కువగా వేయించిన ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కాలేయం, ప్రేగులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కాలేయం, పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించడానికి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ను నివారించాలి. మితిమీరిన ధూమపానం, మద్యపానం క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే పొగాకు, గుట్కా తినడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.