
కానుగ గింజల పొడిలో ఇంగువ కలిపి తీసుకుంటే కడుపులో నులిపురుగులు నశిస్తాయని అంటున్నారు. కానుగ పువ్వుల పేస్ట్‌ను తలపై రాసుకుంటే బట్టతల రాదు. వీటి ఆకులలోని కరెంజిన్, పొంగాపిన్, ప్యూరనో ఫ్లేవనాయిడ్స్ అనే శక్తివంతమైన పదార్థాలు మెదడు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.

కానుగ చెట్టు పువ్వును రక్తస్రావం హెమోరాయిడ్స్, పైల్స్ చికిత్సకు ఉపయోగిస్తారు. పొత్తికడుపులో కణితులు, స్త్రీ జననేంద్రియ అంటువ్యాధులు, అల్సర్లకు కానుగ చెట్టు కాయలతో చికిత్స చేస్తారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కణజాల కణితులు, అధిక రక్తపోటు, రక్తహీనత చికిత్సలకు కానుగచెట్టు విత్తనం సారాన్ని ఉపయోగిస్తారు. కానుగ గింజలతో తీసే గనూనెతో దీపాల్ని వెలిగిస్తారు. కీళ్లవాపులకు వాడే మందుల్లో వినియోగిస్తారు.

కేంద్ర నాడీ వ్యవస్థను మృదువుగా చేయడానికి కానుగ చెట్టు కాండాన్ని ఉపయోగిస్తారు. కానుగ గింజలను మెత్తగా నూరి తేనెతోనూ, నెయ్యితోనూ, పంచదారతోనూ కలిపి తీసుకుంటే శరీరాంతర్గత రక్తస్రావం ఆగిపోతుంది.

బ్రోంకటైస్, కోరింత దగ్గు, జ్వరం చికిత్సలో కానుగ చెట్టు ఆకుల పొడి సహాయపడుతుంది. రక్తస్రావ నివారిణిగా, పరాన్నజీవి పురుగులను చంపడానికి కానుగ నూనెను ఉపయోగిస్తారు. కోరింత దగ్గు, పైల్స్, కాలేయ నొప్పి, దీర్ఘకాలిక జ్వరం, అల్సర్లు చికిత్స చేయడంలో ఈ నూనె సహాయపడుతుంది. కానుగ కాయలు సబ్బుల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఈ చెట్టు పుల్లలతో గ్రామాల్లో ప్రజలు పల్లు తోముకోవడానికి కూడా వినియోగిస్తారు.

లేత కానుగ ఆకులను తెచ్చి ముద్దగా నూరి నువ్వుల నూనె, ఆవు నెయ్యిల మిశ్రమంలో వేయించి, వేయించిన గోధుమ పిండిని కలిపి తీసుకుంటే అరుగుదల పెరిగి, సుఖ విరేచనమై అర్శమొలలు తగ్గుతాయి. కొన్నిచోట్ల ఆయిల్ ఇంజిన్లలో ఇంధనంగా ఉపయోగించి తిప్పి, విద్యుత్ సరఫరా చేస్తుంటారు.