
సోషల్ మీడియాలో హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. తమ ఫేవరేట్ స్టార్స్ చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు, వారి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో వైరలవుతుంది. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు.

ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? కలువల్లాంటి కళ్లు, మత్తెక్కించే నవ్వు ఆమె సొంతమైన బ్యూటీ మాళవిక మోహనన్. సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 7 ఆగస్టు 1992న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి యుకె మోహనన్ బాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి వీణా మోహనన్.

2013లో “బట్టం బోలే” చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పెట్టా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో మాళవికకు తమిళంలో మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఇటీవలే విక్రమ్ చియాన్ నటించిన తంగళాన్ మూవీలో విలన్ పాత్రలో అదరగొట్టేసింది.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.