
తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారికి తేనె తినిపిస్తే ఉపశమనం లభిస్తుంది. తేనెలో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

తేనెలో రోగనిరోధక శక్తి ఉన్నప్పటికీ ఇందులో చక్కెరలు అధికంగా ఉంటాయి.. తేనెలో ఉండే గ్లెసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. కానీ ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. కాబట్టి తేనె విషయంలో జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

తేనె చక్కెర కంటే తియ్యగా ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి, షుగర్ బాధితులు దీనిని తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తేనెలోని చక్కెరలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి, మధుమేహులు తేనె తీసుకోవడం మానుకోవాలి. లేకపోతే, సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తు్న్నారు.

సాధారణంగా చక్కెరను ఉపయోగించే చోట తేనెను తక్కువ మొత్తంలో ఉపయోగించవచ్చు. కానీ, తేనె తీసుకునే ముందు, మీరు మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. లేదంటే, ఒక రోజుకు ఒక టీస్పూన్ కంటే ఎక్కువ తేనె తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

తేనెలో ఐరన్, కాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అయితే బ్యాలెన్స్‌డ్ డైట్‌లో చక్కెర కంటే తేనె వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ, మధుమేహం బాధితుల్లో తేనె, చక్కెర రెండూ చేటు చేస్తాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.