
మధుమేహాం.. దీనిని వ్యాధిగా భావించరాదని వైద్యులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య మాత్రమేనని అంటున్నారు. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. అందుకే మధుమేహులు వారి ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతుంటారు. మీరు తీసుకునే ఆహారం, పండ్లు, కూరగాయలు కూడా మీ బ్లడ్ షుగర్‌ను ప్రభావితం చేస్తాయి.

స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. స్ట్రాబెర్రీ శోథ నిరోధక ప్రభావాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. స్ట్రాబెర్రీలు సహజ తీపితో ఉన్నప్పటికీ తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. అంటే, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

మధుమేహానికి ప్రధాన కారణం ఊబకాయం. స్ట్రాబెర్రీలను తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఎందుకంటే వాటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది. అలాగే, ఫైబర్ బరువు నియంత్రణలో సహాయపడుతుంది. మధుమేహం నియంత్రణలో ఇది మరొక ముఖ్యమైన అంశం.

మధుమేహం గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. స్ట్రాబెర్రీలు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. డయాబెటిక్ బాధితులు సమతుల్య ఆహారంలో భాగంగా స్ట్రాబెర్రీలను కూడా తీసుకొవచ్చు అంటున్నారు నిపుణులు.

కంటి ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. ముఖ్యంగా గుండెకు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తోంది. జీర్ణవ్యవస్థను కూడా మెరుగు పరుస్తుంది. క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలకు చెక్ పెట్డవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా నోటి దుర్వాసనతో పాటు దంత సమస్యలను కూడా నివారించవచ్చు. ముఖ్యంగా నోటి క్యాన్సర్‌ను దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.