పండ్లలో సాధారణంగా ఫ్రక్టోజ్, సుక్రోజ్ అనే చక్కెరలు ఉంటాయి. పండు పచ్చిగా ఉన్నప్పుడు కంటే బాగా పండినప్పుడు అందులోని ఫ్రక్టోజ్ శాతం తగ్గి సుక్రోజ్ శాతం పెరుగుతుంది. దీనివల్ల పండుకు తీపి రుచి వస్తుంది. ఇలా బాగా పండిన పండ్లను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు పండ్ల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలి.

గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెరను ఎంత వేగంగా పెంచుతుందో తెలిపే కొలత. పండిన అరటిపండు గ్లైసెమిక్ ఇండెక్స్ 62 కాగా, మనం వాడే సహజ చక్కెర GI 63. అంటే అరటిపండు తినడం దాదాపు నేరుగా చక్కెర తినడంతో సమానమని మనం అర్థం చేసుకోవాలి. కేవలం GI మాత్రమే కాకుండా గ్లైసెమిక్ లోడ్ కూడా ముఖ్యమే. అరటిపండు GL 13 గా ఉంటుంది కానీ మధుమేహులు GL 10 కంటే తక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం సురక్షితం.

ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల విషయానికి వస్తే.. 25 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మధుమేహులకు మేలు చేస్తాయి. ఉదాహరణకు జామకాయ, దోసకాయ, ఆకుకూరలు, వేరుశెనగ వంటివి రక్తంలో చక్కెరను త్వరగా పెంచవు. వీటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి సురక్షితమైన ఎంపికలుగా నిలుస్తాయి.

తీపి పండ్ల పట్ల మనకు ఉండే కోరిక వెనుక పెద్ద ప్రమాదం దాగి ఉందని డాక్టర్ హెచ్చరించారు. తీపి పండ్లలో ఉండే ఫ్రక్టోజ్ కాలేయంలో కొవ్వుగా మారి నిల్వ చేయబడుతుంది. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు, ఊబకాయం, రక్తంలో ట్రైగ్లిజరైడ్లు పెరిగే అవకాశం ఉంది. కేవలం షుగర్ పెరగడమే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలపై కూడా ఇది ప్రభావం చూపుతుంది.