
క్యాబేజీలో విటమిన్ కె, అయోడిన్, ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ మూలకాలు మెదడుకు మేలు చేస్తాయి. అలాగే, క్యాబేజీ అల్జీమర్స్ రోగుల మెదడులో కనిపించే చెడు ప్రోటీన్ల మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Cabbage

కేన్సర్: క్యాబేజీలో గ్లూకోసైనోలేట్స్, సల్ఫర్ ఉంటుంది. అంతేకాదు క్యాబేజీలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కేన్సర్ ను నివారిస్తుంది అని వెబ్ ఎండీ తెలిపింది. క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది.

జీర్ణక్రియ: ఫైబర్ పుష్కలంగా ఉండే క్యాబేజీ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.ఇది కడుపు అల్సర్ రాకుండా చేస్తుంది. క్యాబేజీని డైట్లో చేర్చుకోవడం వల్ల మన శరీర పనితీరు కూడా మెరుగవుతుంది. ఫైబర్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా మీ దరిచేరదు.శరీరంలో మంట వాపు సమస్యలకు కూడా క్యాబేజీ చెక్ పెడుతుంది. దీంతో కేన్సర్, గుండె సమస్యలు, డయాబెటీస్, అల్జీమర్స్‌తో బాధపడేవారికి ఎంతో ఆరోగ్యం.

క్యాబేజీలో ఉండే సల్ఫర్‌తో కూడిన సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం క్యాన్సర్-పోరాట శక్తిని కలిగి ఉంటుంది. ఈ సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది.