మినప పప్పులో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, కాపర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఫాస్పరస్ ఉన్నాయి. ఈ పప్పు పూర్తి పోషకాహార ప్యాకేజీ. మినప పప్పులో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఈ పప్పులో దాదాపు 25 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. శాకాహారులకు ఇది మంచి ప్రొటీన్ మూలం.
మినప పప్పులో ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాల్షియంతో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మినప పప్పులో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మినప పప్పును పోషకాల గనిగా చెబుతున్నారు నిపుణులు. షుగర్బాధితులు మినప పప్పును డైలీ డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొట్టు తీయని మినప పప్పును తీసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనకరం.ఈ పప్పులో పుష్కలంగా ఉండే ఫైబర్, ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
మినప పప్పులో సమృద్ధిగా ఉండే కాల్షియం, పాస్పరస్ ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి.బరువు తగ్గాలనుకునేవారికి మరింత మంచిది. మినప పప్పులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. కిడ్నీల సంరక్షణకు మరింత మంచిది. మినప పప్పు పురుషులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది.
మినప పప్పు చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఈ పప్పులోని పోషకాలు సన్ టాన్స్, మొటిమలు, ఇతర చర్మ సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. బ్లాక్ ఉరద్ పప్పు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జుట్టు ఆరోగ్యానికి మినప పప్పు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.