
నిమ్మకాయ నీరు అనేక పోషకాలతో నిండిఉంటుంది. అయితే దీన్ని అధికంగా తీసుకుంటే ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ పళ్ల ఎనామిల్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందువల్ల, నిమ్మకాయ నీరు తాగిన వెంటనే నోటిని శుభ్రం చేసుకోవడం మంచిది.

రోజూ నిమ్మకాయ నీరు తాగటం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరానికి తగినంత తేమను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ C సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని అనారోగ్యాల నుంచి కాపాడుతుంది.

lemon

అంతేకాదు.. నిమ్మకాయ నీరు బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి, ఎక్కువసేప కడుపు నిండుగా ఉన్న భావాన్ని కలిగించడంతో ఆకలిని అదుపులో ఉంచుతుంది. శ్వాసను తాజాగా ఉంచుతుంది. నోటిలో దుర్వాసన సమస్యలను సహజసిద్ధంగా నివారిస్తుంది.

నిమ్మకాయ నీరు చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. కాలేయాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. నిమ్మకాయ నీరు కాలేయాన్ని శుభ్రపరిచేందుకు ఉపయోగపడుతుంది.