
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరం ఎలా సపోర్ట్ చేయదో.. బ్రెయిన్ కూడా సపోర్ట్ చేయదు. మెదడు పని తీరు అనేది కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా మీరు యంగ్ ఏజ్‌లో ఉన్నా మీరు సరిగ్గా ఏకాగ్రత పెట్టలేక పోతున్నారా? మతి మరుపు పెరుగుతున్నట్లయితే ఇలా చేయండి.

ప్రస్తుత కాలంలో అందరికంటే ముందు ఉండాలంటే బ్రెయిన్ కంప్యూటర్‌లా వేగంగా పని చేయాలి. కాబట్టి మెదడుకు కూడా మేత పెడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల బ్రెయిన్ పని తీరు అనేది వేగవంతం అవుతుంది.

ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. అవి గుర్తు పెట్టుకునేందుకు ట్రై చేయండి. దీని వల్ల మైండ్ ఎప్పుడూ షార్ప్‌గా పని చేస్తుంది. బ్రెయిన్ షార్ప్‌గా ఉంటే.. పని తీరు మెరుగు పడి మతి మరుపు అనేది రాకుండా ఉంటుంది.

బ్రెయిన్ యాక్టీవ్‌గా పని చేయాలంటే నిద్ర కూడా చాలా అవసరం. కనీసం 7 గంటల నుంచి 9 గంటల వరకు పని చేయాలి. ఇలా చేయడం వల్ల మెదడు అనేది రీచార్జ్ అవుతుంది. మెదడు కణాలు కూడా యాక్టీవ్ అవుతుంది.

ఎప్పుడూ నాలుక కోసమే కాకుండా శరీరం, మెదడును యాక్టీవ్‌గా చేసే ఫుడ్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. తృణ ధాన్యాలు, చేపలు, వాల్ నట్స్, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, అవిసె గింజలు వంటివి తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఆరోగ్యంగా పని చేస్తుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)