
ఒక గ్లాస్ మజ్జిగలో 1 టీస్పూన్ అల్లం రసం కలిపి, కొద్దిగా జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి. చల్లగా తాగితే మరింత లాభదాయకం అంటున్నారు ఆరోగ్యనిపుణులు. వేసవిలో మజ్జిగ ఒక గొప్ప పానీయం అంటున్నారు. ఇది లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉందని చెబుతున్నారు.

అల్లం మజ్జిగ వేసవిలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. డీహైడ్రేషన్ సమస్యలు నివారించడంలో ఇది మంచి శీతల పానీయం. మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉండటంతో జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అల్లం కలిపి తాగితే అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.

అల్లంలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవికాలంలో ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో ఇది సహాయపడుతుంది. మజ్జిగ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే మంచి సహజ పానీయం. వేసవిలో డిహైడ్రేషన్ గా ఉన్నప్పుడు ఇది తాగడం చాలా మంచిది.

అల్లం మజ్జిగ పొట్టలో మంటను తగ్గిస్తుంది. ఇది గ్యాస్, గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మజ్జిగ తక్కువ కేలరీలతో ఉండటంతో బరువు తగ్గే వారికి ఇది మంచి ఎంపిక. అల్లం మెటబాలిజాన్ని పెంచి కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.

పాలతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ, ఇది ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా వుంటుంది. అంతే కాకుండా, మజ్జిగలో సోడియం, పొటాషియం, భాస్వరం, విటమిన్లు తక్కువ మొత్తంలో ఉంటాయి. మిక్సర్ జార్‌లో కొద్దిగా పెరుగు వేసి, చిన్న అల్లం ముక్కను మెత్తగా కోసి, అవసరమైనంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులోకి తీసుకుని తాగాలి. అవసరమైతే, జీలకర్ర పొడిని కలుపుకోవచ్చు.