
భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో హారియర్ ఈవీ కారును ఈ నెలలోనే రిలీజ్ చేయనుంది. బ్యాటరీతో నడిచే ఈ ఎస్‌యూవీ టాటాకు సంబంధించిన యాక్టి డాట్ ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ కారు పీక్ టార్క్ 500 ఎన్ఎంగా రేట్ చేశారు. ఈ కారు అంచనా ధర రూ. 23 లక్షలుగా ఉండనుంది.

ఎంజీ మోటార్ కంపెనీకు సంబంధించిన సీబీయూ మోడల్ సైబర్‌స్టర్‌ను ఈ నెలలోనే మార్కెట్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్‌ను ఎంజీ సెలెక్ట్ షోరూమ్‌ల ద్వారా విక్రయించనున్నారు. సైబర్‌స్టర్ కోసం ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు డ్యూయల్-మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ డ్యూయల్-మోటార్ సెటప్, 504 బీహెచ్‌పీ, 725 ఎన్ఎం పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆఫర్‌లో నాలుగు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. కంఫర్ట్, కస్టమ్, స్పోర్ట్, ట్రాక్. డ్యూయల్-మోటార్ సెటప్ 77 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ నుంచి శక్తిని పొందుతుంది. ఈ కారు ఒకే ఛార్జ్‌లో 444 కి.మీ.ల పరిధిని హామీ ఇస్తుంది. ఈ కారు అంచనా ధర రూ. 75 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ప్రముఖ కంపెనీ స్కోడా చాలా కాలం తర్వాత సెకండ్ జెనరేషన్ కోడియాక్‌ను భారతదేశంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ కారు 187 బీహెచ్‌పీ, 320 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0 లీటర్ టీఎస్ఐ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో అందించే అవకాశం ఉంది. మిడ్ 7 స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారు అంచనా ధర రూ. 30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

భారతదేశంలో ప్రముఖ కార్ల కంపెనీగా ప్రాచుర్యం పొందిన వోక్స్‌వ్యాగన్ తన సరికొత్త కారు టిగువాన్‌ను ఏప్రిల్ 14న రిలీజ్ చేయనుంది. టిగువాన్ ఆర్ లైన్‌పేరుతో సీబీయూ మోడల్‌గా ఈ కారు రిలీజ్ చేస్తున్నారు. ఈ కారు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేసి 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా పని చేస్తుంది. ఇండియా స్పెక్ టిగువాన్ ఆర్ లైన్ 201 బీహెచ్‌పీ, 320 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వోక్స్‌వ్యాగన్‌కు సంబంధించిన 4 మోషన్ ఏడబ్ల్యూడీ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ పంపబడుతుంది. ఈ కారు అంచనా ధర రూ. 50 లక్షలుగా ఉండనుంది.

మారుతీ సుజుకీ ఈ నెల చివర్లో భారతదేశంలో తన మొదటి ఈవీ ఈ-విటారాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది . ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మిలన్‌లో జరిగిన ఈఐసీఎంఏ 2025లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఆ తర్వాత భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో గ్రాండ్ షో చేసింది. ఈ కారు హార్ట్ఎక్ట్ -ఈ ప్లాట్‌ఫామ్ ద్వాార రెండు బ్యాటరీ సామర్థ్యాలతో అందుబాటులో ఉండనుంది. 49 కేడబ్ల్యూహెచ్, 61 కేడబ్ల్యూహెచ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉండే ఈ కారు ఓ సారి చార్జ్ చేస్తే 500 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ కారు అంచనా ధర రూ. 18 లక్షలుగా ఉంది.