
TVS Apache RTR 165 RP:: ఇండియాలో రేస్ బైక్‌లపై ఫోకస్ పెట్టిన టీవీఎస్ భారత మార్కెట్లో అపాచీ ఆర్‌టీఆర్ 165 ఆర్‌పీని విడుదల చేసింది. ఈ బైక్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీని పోలి ఉంటుంది. కానీ ధర మాత్రం ఎక్కువే ఉంటుంది.

అపాచీ ఆర్‌టీఆర్ 165 ఆర్‌పీ రూ 1.45 లక్షలు (ఎక్స్‌షోరూమ్) ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అపాచీ 165 ఆర్‌పీ న్యూ ఇంజన్‌తో అత్యంత పవర్‌ఫుల్ బైక్‌గా మార్కెట్లో విడుదల అయ్యింది.

టీవీఎస్ మొదటి ఆర్‌పీ బైక్ కొన్ని మెకానికల్ మార్పులతో స్పోర్టీ డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఈ బైక్ 164.9 సీసీ సింగిల్ సిలిండర్, 15 శాతం భారీ వాల్వ్స్, అధిక కంప్రెషన్ రేషియో కోసం న్యూ డోం పిస్టన్‌తో పాటు రేసింగ్ ఫీచర్లుతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది.

ఈ బైక్‌లో అత్యాధునిక ఫీచర్స్‌ను పొందుపర్చినట్లు టీవీఎస్ మోటారు సైకిల్స్ మార్కెటింగ్‌లో ప్రీమియం బిజినెస్ హెడ్ తెలిపారు. రెసింగ్ సిరీస్ ప్రోడక్ట్ పోర్ట్‌పోలియోలో టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 165 ఆర్‌పీ తొలి ప్రోడక్ట్ అని ఆయన వెల్లడించారు.