
కవాసకి నింజా హెచ్ఆర్ అనేది ట్రాక్-ఓన్లీ మోటార్ సైకిల్. అంటే మీరు పబ్లిక్ రోడ్లపై దీన్ని నడపలేరు. ఇది శక్తివంతమైన 998 సీసీ ఇంజిన్‌తో కలిగి ఉంది. ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ బైక్ ట్యాంక్ సామర్థ్యం 17 లీటర్లు, అలాగే సీటు ఎత్తు 830 మి.మీ. నింజా హెచ్ఆర్ స్టాండర్డ్ ధర రూ.79,90,000 వద్ద ప్రారంభమవుతుంది.

హార్లే-డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ బైక్ ఐకానిక్ హార్లే సౌండ్ యువతను అమితంగా ఆకట్టుకుంటుంది. 1,868 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ బరువు 387 కిలోలు ఉన్నాయి. 22.7 లీటర్ ట్యాంక్ సామర్థ్యంతో రోడ్ గ్లైడ్ స్పెషల్ స్టాండర్డ్ ప్రారంభ ధర రూ. 41,78,915గా ఉంది.

బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ బైక్ 999 సీసీ ఇంజన్‌తో వస్తుంది. ఆకట్టుకునే పనితీరుతో వచ్చే ఈ బైక్ 192 కిలోల బరువు, 16.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. ఇది 832 మిమీ సౌకర్యవంతమైన సీట్ ఎత్తుతో వస్తుంది. ఈ బైక్ స్టాండర్డ్ రూ 49,00,000 నుంచి ప్రారంభమవుతుంది.

డుకాటి పనిగేల్ వీ4 ఆర్ 998 సీసీ ఇంజిన్‌తో ద్వారా మెరుగైన శక్తి, పనితీరు ఆకట్టుకుంటుంది. 193.5 కిలోల బరువు, 17 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ ఈ బైక్ ప్రత్యేకత. ఇది 850 మిల్లీమీటర్ల సౌకర్యవంతమైన సీట్‌తో వస్తుంది. ఈ బైక్ స్టాండర్డ్ ప్రారంభ ధర రూ. 69,99,000గా ఉంది.

హెూండా గోల్డ్ వింగ్ టూర్ బైక్ శక్తివంతమైన 1,833 సీసీ ఇంజన్‌తో వస్తుంది. స్మూత్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో వచ్చే ఈ బైక్ బరువు 390 కిలోలు. ఈ బైక్ 21.1 లీటర్ల ఇంధన సామర్థ్యంతో వస్తుంది. ఈ బైక్ గరిష్టంగా 124.7 బీహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. గోల్డ్ వింగ్ టూర్ స్టాండర్డ్ ధర రూ. 39,77,923 వద్ద ప్రారంభమవుతుంది.