
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాట ధరలు హాట్ టాపిక్‌గా మారిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న ధరల దృష్ట్యా టమాటాలు కూడా విలాస వస్తువుల జాబితాలో చేరాయి. ఈ నేపథ్యంలో పలు వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు టమాటా ఆఫర్ ఇస్తున్నాయి. తాజాగా మధురైలోని దేశీయ విమాన సంస్థ ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకుంటే కిలో టమాటా ఫ్రీ అంటూ ప్రకటించింది.

అదే అంతర్జాతీయ విమాన టికెట్ బుకింగ్ చేసుకున్న వారు మరింత అదృష్టవంతులు. వారిక ఏకంగా రూ.కిలోన్నర టమాటాలు ఉచితం అని ప్రకటన విడుదల చేసింది. ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఇచ్చింది.

జూలై 11, 12 తేదీల్లో ఈ ఆఫర్ చాలా మంది కస్టమర్‌లను ఆకర్షించింది. పైగా మా వ్యాపారానికి టమాటాలు బాగా సహాయపడ్డాయని ఏజెన్సీ యాజమన్యం సంతోషం వ్యక్తం చేసింది.

కాగా దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు తమిళనాడులో కూడా టమాట ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. టమాట ధరలకు కళ్లెం వేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సబ్బిడీకి టమాటాలను పంపిణీ చేస్తోంది కూడా.

టమోటాలకు విలాసవంతమైన హోదా దక్కడంతో ఏఐఏడీఎంకే రాజకీయ పార్టీ వేడుకల సదర్భంగా పార్టీ శ్రేణులు మహిళలకు ఉచితంగా టమోటాలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. మొత్తం 100 కిలోగ్రాముల టమాటాలను మహిళలకు ఉచితంగా పంపిణీ చేశారు.