మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు మారబోతున్నాయి. ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులు విలీనం కాబోతున్నాయి. దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు వంటి ఎనిమిది బ్యాంకులు విలీనం అవుతున్నాయి. తర్వాత ఈ బ్యాంకు కస్టమర్ల చెక్ బుక్‌లు, పాస్‌బుక్‌లు సహా ఇతర బ్యాంకు విషయాలలో మార్పులు జరుగుతున్నాయి. ఈ మీ ఖాతా కూడా ఇదే బ్యాంకుల్లో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ విలీనం అయ్యే బ్యాంకుల్లో మీ ఖాతాలు ఉన్నట్లయితే సదరు బ్యాంకులకు వెళ్లి మీ బ్యాంకు చెక్‌బుక్‌లు, ఖాతాబుక్, తదితర వివరాలు మార్చుకోవాల్సి ఉంటుంది.