1 / 6
ఓలా ఎస్1 ఎయిర్(Ola S1 Air).. సిటీ వినియోగదారులకు ఓలా అందిస్తున్న మరో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 ఎయిర్. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీనిటాప్ స్పీడ్ 85 కిలోమీటర్లు. మోటార్ గరిష్ట శక్తి 4.5 kw ఉంటుంది. దీనిలోని బ్యాటరీ చార్జింగ్ టైం నాలుగున్నర గంటలు. ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. 2kwh వేరియంట్ 85 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 84,999, 3 kwh బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్కూటర్ 125 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. లక్ష ఉంటుంది. అలాగే 4 kwh వేరియంట్ 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 1.09 లక్షలు ఉంటుంది. దీనిని డెలివరీలు 2023 జూన్ నుంచి ప్రారంభమవుతాయి.