
రూ.15.49 - రూ.26.44 లక్షల ధరతో రిలీజ్ చేసిన, టాటా హారియర్ గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (గ్లోబల్ ఎన్సీఎపి) నుంచి ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్ను పొందింది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఏడు ఎయిర్ బ్యాగ్లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్తో వస్తుంది. హారియర్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. అలాగే ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ మధ్య ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ కారు 167 బీహెచ్‌పీ వద్ద 350 ఎన్‌ఎం టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రూ.16.82 - 20.45 లక్షల ధరతో వచ్చే హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ప్రామాణిక క్రెటాకు సంబంధించిన స్పోర్టియర్ వెర్షన్‌గా లాంచ్ చేశారు. ఈ కారులో కాస్మెటిక్ అప్ గ్రేడ్లు ఆకట్టుకుంటాయి. క్యాబిన్, వెలుపలి భాగంతో పాటు సస్పెన్షన్, స్టీరింగ్లో చిన్న మార్పులు వంటివి ఉన్నాయి. క్రెటా ఎన్ లైన్ కొత్త 1.5-లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. అలాగే ఈ టర్బో- పెట్రోల్ ఇంజన్ను ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ జత చేసిన ఏకైక క్రెటా కారు అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్రెటా ఎన్ లైన్ హ్యుందాయ్ స్మార్ట్ సెన్స్-లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వస్తుంది. అలాగే అదనంగా హిల్-స్టార్ట్ అసిస్ట్‌తో పాటు ఈఎస్‌సీ ఆకట్టుకుంటుంది.

అప్‌డేటెడ్ నెక్సాన్ అధునాతన ఫీచర్లతో కార్ల లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. 2023 టాటా నెక్సాన్ 1.2-లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 1.5-లీటర్ డీజిల్ యూనిట్‌తో వస్తుంది. ఈ కారులో ఆరు ఎయిర్ బ్యాగ్లతో స్టాండర్డ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా వంటి పీచర్లతో వస్తుంది. ముఖ్యంగా నెక్సాన్ పట్టణ ప్రాంతాల్లో వాడడానికి అనువుగా ఉంటుంది. టాటా నెక్సాన్ ధర రూ.8 లక్షల నుంచి రూ.15.8 లక్షల మధ్య ఉంటుంది.

రూ.11.7 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ధరతో రిలీజ్ చేసిన వోక్స్ వ్యాగన్ టైగన్, కుషాక్ ఇటీవల కాలంలో వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కారుల్లో ఆరు ఎయిర్ బ్యాగ్లు, మల్టీ-కొలిజన్ బ్రేక్లు వంటి మంచి భద్రతా లక్షణాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ కార్లు రెండు ఇంజన్ ఎంపికలతో వస్తాయి. అలాగే 1.5 లీటర్ టీఎస్‌ఐ ఇంజన్ 148 బీహెచ్‌పీ, 250 ఎన్‌ఎం టార్క్ ను అందిస్తుంది. అలాగే పెట్రోల్ హెడ్లకు ఎంపిక ట్రిమ్‌గా ఉంటుంది. టైగన్, కుషాక్ గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి నుండి ఫైవ్ స్టార్ రేటింగ్ పొందాయి.

రూ.12.16 నుంచి రూ.13.3 లక్షల మధ్య ధరతో హ్యూందాయ్ వెన్యూ ఎన్ లైన్ కారు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కారు కేవలం ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ కారు వెనుక వైపు సరికొత్త డిస్క్ బ్రేక్లతో వస్తుంది.