
మహీంద్రా ఎక్స్‌యూవీ300 టర్బో.. మన దేశంలో రూ. 10లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ కారు ఇదే. దీనిలో 1.2 లీటర్ టీజీడీఐ ఇంజిన్ ఉంటుంది. ఇది 128.73బీహెచ్ పీ, 230ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 9.30లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.

హ్యూందాయ్ ఐ20 ఎన్-లైన్.. ఇది హ్యూందాయ్ ఐ20కి అప్ గ్రేడెడ్ వెర్షన్. దీనిలో 1.0లీటర్ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 118.41 బీహెచ్పీ, 172ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 9.99లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.

సిట్రోయిన్ సీ3 ఎయిర్ క్రాస్.. సిట్రోయిన్ తన మొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ కారుని మన దేశంలో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ. 9.99లక్షల నుంచి ఉంటుంది. దీనిలో 1.2లీటర్ల టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 108.62 బీహెచ్పీ, 190ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

టాటా నెక్సాన్ పెట్రోల్.. ఇది మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్ యూవీ కారు ఇది. టాటా మోటార్స్ ఇటీవల దీని ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను లాంచ్ చేసింది. దీనిలో 1.2 లీటర్ టర్బోచార్జెడ్ ఇంజిన్ ఉంటుంది. 118.27 బీహెచ్పీ, 170ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 8.09లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 పెట్రోల్.. ఈ కారులో 1.2లీటర్ టీసీఎంపీఎఫ్ఐ ఇంజిన్ ఉంటుంది. ఇది 108.62బీహెచ్పీ, 200ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర 7.99లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.