మారుతి సెలెరియో.. ఈ కారులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 65.7బీహెచ్పీ, 89 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేస్తుంది. సెలెరియో పోటీ ధర పాయింట్‌ను కలిగి ఉంది. 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఏఎంటీ) ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో సులభమైన, సౌకర్యవంతమైన కుటుంబ కారును కోరుకునే వ్యక్తులకు ఇది చాలా బాగుంది. దీని ధర రేంజ్ రూ. 6.38లక్షల నుంచి రూ. 7.14 లక్షల వరకూ ఉంటుంది.
మారుతి ఆల్టో కే10.. ఈ కారు మన భారతదేశంలో అత్యంత అనువైన బడ్జెట్లో లభించే ఆటోమేటిక్ కారు. దీనిలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 65.7 బీహెచ్పీ 89ఎన్ఎం రేటింగ్ తో ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో సాఫీగా డ్రైవింగ్ కోసం 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఏఎంటీ)తో వస్తుంది. దీని ధర రూ. రూ. 5.61లక్షల నుంచి రూ. 5.90 లక్షలు వరకూ ఉంటుంది.
రెనాల్ట్ క్విడ్.. స్టైలిష్ ఎక్ట్సీరియర్ తో పాటు 67 బీహెచ్పీ, 91 ఎన్ఎం ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. రెనాల్ట్ క్విడ్ దాని ధర పరిధిలో ఆకర్షణీయమైన ఆటోమేటిక్ ఎంపికను అందిస్తుంది. 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఏఎంటీ) నగరంలో సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. దీని ధర పరిధి రూ. 6.12లక్షల నుంచి రూ. 6.44 లక్షల వరకూ ఉంటుంది.
మారుతి ఎస్-ప్రెస్సో.. దీనిలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 65.7 బీహెచ్పీ, 89 ఎన్ఎం శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనిలోనూ 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఏఎంటీ) ఉంటుంది. ఇది ఆల్టో కంటే విశాలమైన ఇంటీరియర్‌ను అందిస్తుంది, నలుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ఉండేందుకు అనువుగా ఉంటుంది. దీని ధర పరిధి రూ. 5.76 లక్షల నుంచి రూ. 6.05 లక్షలు వరకూ ఉంటుంది.
మారుతి వ్యాగన్-ఆర్.. ఈకారు రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 1.0-లీటర్ పెట్రోల్ మోటారు, 1.2-లీటర్ పెట్రోల్ మోటారుతో వస్తుంది రెండూ 5-స్పీడ్ ఏఎంటీ తో వస్తాయి. దీని టాల్‌బాయ్ డిజైన్ విస్తారమైన స్థలాన్ని అందిస్తుంది. అయితే క్యాబిన్ కొంచెం పాతదిగా అనిపించవచ్చు. దీని ధర రూ. 6.54లక్షల నుంచి రూ. 7.42 లక్షల వరకూ ఉంటుంది.
టాటా టియాగో .. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 85 బీహెచ్పీ, 113 ఎన్ఎం టార్క్‌ని అందిస్తుంది, 5-స్పీడ్ ఏఎంటీతో జత చేయబడింది. ఇది మంచి భద్రతను కూడా అందిస్తుంది. ఈకారు ఇది గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్ పొందింది. దీని ధర పరిధి రూ. 6.95 లక్షల నుంచి రూ. 7.80 లక్షలు వరకూ ఉంటుంది.