Most Stolen Cars In India: ఈ కార్లంటే దొంగలకు ఎంత ఇష్టమో.. మన దేశంలో అత్యధికంగా చోరీకి గురవుతున్న కార్లు ఇవే..

|

Oct 25, 2023 | 6:05 PM

కారు కొనుగోలు చేయడం అనేది సామాన్యులకు భారమే. అందుకే చాలా మంది కార్ లోన్లు పెట్టి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆ కార్లను కొనుగోలు చేయడం ఓ ఎత్తు అయితే.. వాటిని సంరక్షించుకోవడం మరో ఎత్తు. ఎందుకంటే చాలా ఇళ్లలో ప్రత్యేకమైన పార్కింగ్ స్థలం అంటూ ఏది ఉండదు. కార్లను రోడ్డపైనే ఉంచాల్సిన పరిస్థితి. సరిగ్గా ఇదే దొంగలకు బాగా కలిసివస్తోంది. అందుకే మన దేశంలో కార్ల దొంగతనాలు బాగా పెరిగిపోతున్నాయి. కెమెరాలు ఉన్నా.. సెన్సార్లు ఉన్నా.. కార్ల దొంగతనాలు ఆగడం లేదు. ప్రధాన పట్టణాల్లోనే ఈ కార్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవలి నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 56 శాతానికి పైగా వాహనాల దొంగతనాలకు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ కేంద్రంగా ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1 లక్ష కంటే ఎక్కువ వాహనాలు దొంగతనానికి గురవుతున్నాయి. అయితే దొంగలు అన్ని కార్లను దొంగిలించరు. కొన్ని కార్లను మాత్రమే ఎక్కువగా దొంగిలస్తున్నారు. ఈ కథనంలో భారతదేశంలో అత్యధికంగా దొంగతనానికి గురవుతున్న కార్ల గురించి తెలుసుకుందాం..

1 / 5
మారుతి సుజుకి స్విఫ్ట్.. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. ఇంధన సామర్థ్యం, ​​లుక్స్, స్తోమత, అధిక-రీసేల్ విలువ స్విఫ్ట్‌ను దేశంలోని ప్రముఖ మోడల్‌లలో ఒకటిగా మార్చింది. అదే సమయంలో అత్యధికంగా దొంగతనానికి గురైన కారు కూడా ఇదే. ఈ కారులో 1.2 లీటర్, 4 సిలెండర్ ఎఏ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ ఆటోమేటిక్ ఆప్షన్లలో ఉంటుంది. దీని ధరలు రూ. 5.99లక్షల నుంచి రూ. 9.04లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.

2 / 5
మారుతి సుజుకి వ్యాగన్ఆర్..  ఈ కారన్నా దొంగలకు చాలా ఇష్టం లాగా ఉంది. అందుకే దీనిని అధికంగా దొంగిలిస్తున్నారు.  ఈ కారు రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 1.0 లీటర్ 3 సిలెండర్, ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్, 4 సిలెండర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్  ఉంటుంది. ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ ఆటోమేటిక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 5.54లక్షల నుంచి 7.42లక్షల(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.

3 / 5
హ్యూందాయ్ క్రెటా.. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్ యూవీ కారు ఇది. మరోవైపు అత్యధికంగా దొంగతనానికి గురవుతున్న కార్లలో మూడో స్థానంలో ఉంది. ఈ కారు బాడీ విడి భాగాలకు చాలా డిమాండ్ ఉంది. దీంతో దొంగలు కారును దొంగిలించి విడి భాగాలను అమ్మేసుకుంటున్నారు. ఈ కారు కూడా రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 1.5 లీటర్, 4 సిలెండర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 1.5లీటర్, 4 సిలెండర్, టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ. 10.87లక్షల నుంచి రూ. 19.2లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.

4 / 5
హ్యూందాయ్ శాంట్రో.. అత్యధికంగా దొంగతనానికి గురవుతున్న కార్లలో మరో హ్యాందాయ్ కారు ఉంది. అదే హ్యూందాయ్ శాంట్రో. ఇది ప్రీమియం చిన్న కారు. అయితే ఈ కారు సేల్స్ తక్కువగా ఉండటంతో కంపెనీ దీని తయారీని నిలిపివేసింది. అయితే దీని విడి భాగాల కోసం దొంగలు ఈ కార్లను టార్గెట్ చేస్తున్నారు.

5 / 5
హోండా సిటీ.. దేశంలో అత్యధికంగా దొంగతనానికి గురవుతున్న కార్లలో ఐదో స్థానం ఈ కారుది. హోండా కంపెనీలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇదే. దీనిలో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. 1.5 లీటర్, ఎన్ఏ పెట్రోల్, 1.5 లీటర్ హైబ్రీడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ. 11.67లక్షల నుంచి రూ. 16.15లక్షలు(ఎక్స్ షోరూం) వరకూ ఉంటుంది.