ఎస్‌బీఐ అమృత్ కలశ్ పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌లో సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని అందిస్తుంది.
యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా యూనియన్ సమృద్ధి పేరుతో 333 రోజుల వ్యవధితో ప్రత్యేక ఎఫ్‌డీను అందుబాటులో ఉంచింది. సాధారణ పౌరులకు వడ్డీ రేటు 7.40 శాతం ఇస్తుంటే సీనియర్ సిటిజన్లు 7.90 శాతం వడ్డీని అందిస్తుంది.
రూ. 4 లక్షలను ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.36534 వడ్డీ వస్తుంది. అలాగే రూ.8 లక్షలను చేస్తే 73,068 వడ్డీ వస్తుంది.
అయితే సీనియర్ సిటిజన్లక రూ. 4 లక్షలను ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.39148 వడ్డీ వస్తుంది. అలాగే రూ.8 లక్షలను చేస్తే 78,296 వడ్డీ వస్తుంది.
యూనియన్ బ్యాంకులో రూ. 4 లక్షల పెట్టుబడిపై వడ్డీ రూ. 27,673.47 వస్తే రూ. 8 లక్షల పెట్టుబడిపై రూ. 55,346 వస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు రూ.4 లక్షలపై రూ. 29,592 వడ్డీ వస్తే రూ.8 లక్షల పెట్టుబడిపై రూ. 59,184 వడ్డీ వస్తుంది.