TATA Motors: మార్కెట్లోటాటా మోటర్స్ దూసుపోతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల మార్కెట్(Rural Markets)పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది టాటా. వినియోగదారుల ఇంటి వద్దకే కార్లను (Cars) తీసుకెళ్లే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది.
అనుభవ్ పేరుతో మొబైల్ షోరూమ్‌లను ఆవిష్కరించింది. వీటి ద్వారా కస్టమర్ల ఇంటివద్దనే కార్లను విక్రమించేలా చర్యలు చేపట్టింది. అలాగే కొత్త మోడళ్ల సమాచారం, రుణ పథకాలు, టెస్ట్ డ్రైవ్, పాత కార్ల మార్పడి వంటి సర్వీసులు అందుబాటులో ఉంచనుంది.
దేశ వ్యాప్తంగా 103 మొబైల్ షోరూమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ చర్యలు చేపడుతోంది. సమీపంలోని టాటా మోటార్స్ డీలప్‌షిప్ వీటిని నిర్వహిస్తుంది. జనాభా, ఆర్థికపరంగా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో సంస్థ పరిధిని పెంచడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని కంపెనీ చెబుతోంది.
దేశ వ్యాప్తంగా మొత్తం కార్ల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల వాట 40 శాతం వరకు ఉంది. కస్టమర్ల ఇంటి వద్దనే కార్ల విక్రయం ద్వారా మార్కెట్ మరింతగా పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది.