Top 5 SUV’s: సూపర్ స్మార్ట్ ఫీచర్స్‌తో ఆకర్షిస్తున్న ఎస్‌యూవీలు.. పది లక్షల్లో పొందికైన కార్లు ఇవే..!

|

Sep 12, 2024 | 7:45 PM

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇటీవల కాలంలో కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా తక్కువ ధరల్లోనే సన్‌రూఫ్ ఉండే కార్లను యువత అమితంగా ఇష్టపడుతున్నారు. లాంగ్ డ్రైవ్స్ చేసే సమయంలో, అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టూర్స్ వెళ్లే సమయంలో సన్‌రూఫ్ కార్స్‌తో ఉండే ఎంజాయ్‌మెంట్ వేరని ఫీలవుతున్నారు. ఆకట్టుకునే ఫీచర్స్‌తో పాటు సన్‌రూఫ్ ఉన్న కార్ల అమ్మకాలు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తక్కువ ధరల్లోనే సూపర్ ఫీచర్స్‌తో సన్‌రూఫ్ కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ.10 లక్షల కంటే తక్కువ ధరలో మార్కెట్‌లో అందుబాటులో టాప్ ఎస్‌యూవీల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
హ్యుందాయ్ 2023లో ఎక్స్‌టర్‌తో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ మైక్రో ఎస్‌యూవీ భారతీయ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న వాహనాలలో ఒకటిగా ఉంది. ఎక్స్‌టర్ ఎస్‌ఎక్స్ వేరియంట్ నుంచి సన్‌రూఫ్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 8.23 ​​లక్షలు. ఎస్ఎక్స్ నైట్, ఎస్ఎక్స్(ఓ), ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్, ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్ నైట్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్‌టర్ 82 బీహెచ్‌పీ, 113.8 ఎన్ఎమ్ అవుట్‌పుట్‌తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

2 / 5
కియా సోనెట్  సన్‌రూఫ్ వేరియంట్స్ హెచ్‌టీఈ(ఓ) మోడల్‌తో అందుబాటులో ఉంటాయి. ఈ కారు ధర రూ. 8.29 లక్షలుగా ఉంది. ఈ కారు 1.2 లీటర్  పెట్రోల్ ఇంజన్ 82 బీహెచ్‌పీ, 115 ఎన్ఎం  టార్క్‌ను అందిస్తుంది. ప్రత్యేకంగా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఈ కారు ప్రత్యేకతగా ఉంది.

3 / 5
టాటా పంచ్ సన్‌రూఫ్ వేరియంట్‌ రూ. 8.35 లక్షల ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎంపికను కలిగి ఉన్న ఇతర వేరియంట్‌లలో అకాంప్లిష్డ్ డాజిల్ సన్‌రూఫ్, క్రియేటివ్ డీటీ ఎస్ఆర్ క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ డీటీ ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ. 8.75 లక్షలు, రూ. 9.30 లక్షలు, రూ. 9.60 లక్షలుగా ఉన్నాయి. ఈ కారు 86.5 బీహెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందించే 1.2 లీటర్ ఇంజన్‌తో  వస్తుంది. పంచ్ రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్‌తో పాటు ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

4 / 5
మహీంద్రా 3ఎక్స్ఓ టాప్ టైర్ మోడళ్లకు ప్రత్యేకమైన సింగిల్ ప్యానెల్, పనోరమిక్ సన్‌రూఫ్‌‌తో వస్తుంది. అలాగే ఎంఎక్స్ 2 ప్రో సింగిల్-ప్యానెల్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. ఈ కారు ధర రూ.8.99 లక్షలుగా ఉంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారు 80 బీహెచ్‌పీ 1.2 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.

5 / 5
హ్యుందాయ్ వెన్యూ సన్‌రూఫ్‌తో కూడిన రెండు వేరియంట్‌లను అందిస్తుంది. ఎకనామిక్ ఎస్+ మోడల్ ధర రూ. 9.36 లక్షలు, ఎస్(ఓ)+ వేరియంట్ రూ. 9.99 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ రెండు ట్రిమ్‌లు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే 82 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం టార్క్‌ను అందించే 1.2 లీటర్ ఇంజన్‌తో వస్తాయి.