- Telugu News Photo Gallery Business photos Scooters are a tough competition for bikes, Best Scooters details in telugu
Best Scooters: బైక్స్‌కు గట్టి పోటీనిస్తున్న స్కూటర్లు.. తగ్గేదేలే అన్నట్లు అబ్బురపరుస్తున్న అమ్మకాలు
2001లో మొట్టమొదటి హోండా యాక్టివా లాంచ్ అయినప్పటి నుంచి గేర్‌లెస్ స్కూటర్‌ల ప్రజాదరణ క్రమంగా పెరుగుతోంది. సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని ప్రయాణనికి ఇవి అనువుగా ఉండడంతో ఎక్కువ మంది వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పట్టణాల్లోని ట్రాఫిక్ నేపథ్యంలో ఇవి డ్రైవ్ చేయడానిక సులభంగా ఉండడంతో జెండర్ అసమానతలు లేకుండా అందరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న టాప్ 5 అత్యంత సరసమైన పెట్రోల్ స్కూటర్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
Updated on: Feb 21, 2024 | 8:30 AM

హీరో డెస్టినీ ప్రైమ్ స్కూటర్ రూ.71,499కు కొనుగోలు అందుబాటులో ఉంటుంది. ద్విచక్ర వాహనాలను సరసమైనదిగా తయారు చేయడంతో పాటు దాని విస్తారమైన ఉత్పాదక సామర్థ్యాలను ఉపయోగించుకోవడం, స్కేల్ ఎకానమీలను పెంచడానికి అద్భుతమైన వాల్యూమ్‌లను ఉపయోగించడం గురించి హీరో ముందువరుసలో ఉంటుంది. డెస్టీనీ ప్రైమ్ గతంలో డెస్టినీ 125 దేశంలోనే అత్యంత సరసమైన 125 సీసీ స్కూటర్. ఈ స్కూటర్‌లో వచ్చే యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి.

హోండా యాక్టివా కుటుంబ స్కూటర్‌గా ఎంత జనాదరణ పొందిందో దాని కజిన్ డియో కూడా ఇటీవల కాలంలో అధిక ప్రజాదరణ పొందింది. డియోను ముఖ్యంగా యువత అధికంగా ఇష్టపడుతున్నారు. స్టైలింగ్‌పరంగా ఆకట్టుకునే ఈ స్కూటర్ ధర రూ.70,211 నుంచి రూ.77,712 వరకూ ఉంటుంది.

హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్ కూడా యువతులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ స్కూటర్ 110 సీసీతో వస్తుంది. ఈ స్కూటర్ ధర ప్రాథమిక వెర్షన్‌కు రూ. 70,338 నుంచి మొదలవుతుంది. అలాగే ఎల్‌ఈడీ హెడ్‌లైట్, జియో-ఫెన్సింగ్, లొకేషన్ ట్రాకింగ్ వంటి కనెక్ట్ చేసేలా ప్రత్యేక ఫీచర్లతో వచ్చే ఎక్స్‌టెక్ వేరియంట్‌కు రూ. 82,238 వరకు ఉంటుంది.

హీరో గ్జూమ్ స్కూటర్ 110.9 సీసీ ఇంజన్‌తో ఆధారంగా పని చేస్తుంది. ముఖ్యంగా హోండా డియోకు పోటీగా ఈ స్కూటర్‌లో స్పోర్టీ స్టైలింగ్‌తో పాటు మంచి ఫీచర్లు ఉన్నాయి.వాటిలో బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రత్యేకమైన కార్నరింగ్ లైట్లు, టాప్ వేరియంట్‌లో డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్2తో వస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.70,184 నుంచి ప్రారంభమై రూ.78,517 వరకు ఉన్నాయి.

టీవీఎస్ స్కూటీ పెప్ ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత సరసమైన పెట్రోల్ స్కూటర్ ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఏకైక సబ్ 100 సీసీ స్కూటర్. టీవీఎస్ స్కూటీ పెప్ 87.8 సీసీ మోటారు 5.4 హెచ్‌పీ, 6.5 ఎన్ఎం శక్తిని కలిగి ఉంది. ఈ స్కూటర్ ధర రూ. 65,514 నుంచి 68,414 వరకూ ఉంటుంది.




