SBI Account: ఎస్‌బీఐ అకౌంట్‌ తీసుకోవడం మరింత సులభం.. ఇంట్లో ఉండే ఖాతా తెరవవచ్చు.. ఎలాగంటే..!

|

Apr 23, 2021 | 6:52 PM

SBI Account: స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సేవింగ్స్‌ ఖాతా తెరవడం ఇక మరింత సులభతరం కాబోతోంది. ఎస్‌బీఐ మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ యోనో ద్వారా ఇంటి నుంచే సేవింగ్‌ ...

1 / 4
SBI Account: స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో సేవింగ్స్‌ ఖాతా తెరవడం ఇక మరింత సులభతరం కాబోతోంది. ఎస్‌బీఐ మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ యోనో ద్వారా ఇంటి నుంచే సేవింగ్‌ అకౌంట్‌ తెరువవచ్చు. ఇందు కోసం యోనో యాప్‌లో వీడియో కేవైసీ ( నో యువర్‌ కస్టమర్‌) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కరోనా కారణంగా వినియోగదారుల బ్యాంకుకు రాకుండా ఇంటి నుంచే ఖాతా తెరుచుకునే అవకాశం కల్పించింది.

2 / 4
కాంటాక్ట్‌లెస్‌, పేపర్‌ లెస్‌ విధానంలో ఖాతా తెరిచేందుకు ఈ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్‌బీఐ తెలిపింది. మొబైల్‌ బ్యాంకింగ్‌లో ఇదో కొత్త సదుపాయంగా డిజిటల్‌ వైపు ఆకర్షితులు కావాడనికి ఇది ఎంతగానో దోహదపడుతుందని కంపెనీ చైర్మన్‌ దినేశ్‌ ఖారా తెలిపారు.

3 / 4
ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు కస్టమర్లు ముందుగా యోనో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత న్యూ టు ఎస్‌బీఐ ఆప్షన్‌ను ఎంచుకుని ఇన్‌స్టా ప్లస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేయాలి.

4 / 4
ఆధార్‌ వివరాలు నమోదు చేసి అథెంటికేషన్‌ పూర్తయిన తర్వాత వ్యక్తిగత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం కేవైసీ పూర్తి చేసుకునేందుకు వీడియో కాల్‌ను అటెండ్‌ చేయాల్సి ఉంటుంది. అది పూర్తయిన తర్వాత ఎస్‌బీఐలో ఖాతా ఓపెన్‌ అవుతుంది. ఈ విధానం ద్వారా సులభంగా ఎస్‌బీఐలో ఖాతా తెరవవచ్చు