Royal Enfield Classic 350: భారత్‌లో అత్యంత పాపులారిటీ సంపాదించుకున్న మోటారు సైకిల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. బుల్లెట్ బైక్ ఎక్కి షికార్లు కొట్టాలని చాలామంది యువత ఇష్టపడతారు. అందుకు తగినట్లుగానే కంపెనీ కొత్త బైక్‌లను మార్కెట్లో విడుదల చేస్తుంటుంది. అలాంటి వారికి ఓ గుడ్‌న్యూస్ చెప్పింది రాయల్ఎన్ ఫీల్డ్ సంస్థ. క్లాసిక్ 350 మోడల్‌ను విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు.
ఈ మోడల్‌లో కూడా మెటియోర్ 350 లాంటి ఇంజిన్‌నే అందించింది. అయితే, దాని పవర్ మాత్రం 349cc DOHC ఉండడం వల్ల 20పీఎస్ పీక్ పవర్‌ని 27ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెటియోర్లోని జె ప్లాట్ ఫామ్‌ని ఇందులోకూడా అందించింది. దీనిలో బ్లూటూత్ సహాయంతో స్మార్ట్ ఫోన్కికనెక్ట్ అయ్యి నావిగేషన్‌ని చూపించే ట్రిప్పర్ టర్న్ టు టర్న్ నావిగేషన్‌ని చేర్చింది.అయితే ఇందులో ముందు మోడల్స్‌లో ఉన్న విధంగా కిక్ స్టార్టర్ లేకపోవడం గమనార్హం.
ఈ బైక్ మొత్తం 11 కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో 9 డ్యూయల్ ఛానల్ వేరియంట్లు, రెండు సింగిల్ ఛానల్ వేరియంట్లు ఉన్నాయి. బైక్‌లో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. రెట్రో స్టైల్ రౌండ్ టెయిల్ ల్యాంప్స్, రౌండ్ టర్న్ ఇండికేటర్స్ తో పాటు రిట్రో స్టైల్ హాలోజెన్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉండడం విశేషం. మల్టీ స్పోక్ డ్యుయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఈ బైక్ కే కొత్త అందాన్ని తెచ్చి పెడుతున్నాయి.
ఈ బైక్ 3 వేరియంట్లలో విడుదల కానుంది. సింగిల్ సీటర్ క్లాసిక్ 350, ట్విన్ సీటర్ క్లాసిక్ 350, క్లాసిక్ 350 సింగిల్ ఎడిషన్ వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. దీని ప్రారంభ ధర రూ. 1.85 లక్షలుగా ఉండనుంది. ఇప్పటికే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ధరలు పెరిగాయి. ఇటీవలక్లాసిక్ 350 మోడల్ ధరపెరిగిరూ. 2 లక్షలుగా మారిన సంగతి తెలిసిందే.
రాయల్ ఎన్ ఫీల్డ్ 350 మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ధరలు.. ఫైర్ బాల్ వేరియంట్ ధర - రూ.1.85 లక్షలు, సూపర్ నోవా వేరియంట్ ధర - రూ. 1.86 లక్షలు, స్టెల్లార్ వేరియంట్ ధర -1.90 లక్షలుగా ఉన్నాయి.