Renault India: కార్ల విక్రయాలలో దూసుకుపోతున్న రెనాల్ట్.. 8 లక్షలకు చేరిన విక్రయాలు..!
Renault India: మార్కెట్లో కార్ల హవా కొనసాగుతోంది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది కారు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కార్లను తయారు చేస్తున్న కంపెనీలు..మార్కెట్లో..
Renault India: మార్కెట్లో కార్ల హవా కొనసాగుతోంది. ప్రస్తుత రోజుల్లో చాలా మంది కారు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో కార్లను తయారు చేస్తున్న కంపెనీలు..మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.
1 / 4
భారతదేశంలో ఇప్పటి వరకు 8 లక్షల కార్లను విక్రయించినట్లు ఫ్రెంచ్ వాహన తయారీ కంపెనీ రెనాల్ట్ తెలిపింది. దేశీయ విపణిలోకి అడుగు పెట్టి దశాబ్దం పూర్తయ్యిందని వెల్లడించింది.
2 / 4
కరోనా మహమ్మారి కారణంగా వాహనాల సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయని, గత సంవత్సరం రెనో మంచి గణాంకాలు నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది. పది సంవత్సరాల కిందట భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించిన రెనాల్ట్ దేశీ ఆటోమొబైల్ మార్కెట్‌లో అరుదైన ఘనతను సాధించింది.
3 / 4
భారత్‌లో 8 లక్షల వాహనాల విక్రయాలు జోరుగా సాగడం ఆనందంగా ఉందని తెలిపింది. రెనో అంతర్జాతీయ విక్రయాలకు భారత్ గణనీయ వాటాను అందించిందని అన్నారు.