
దేశంలో రిలయన్స్ జియో టెలికాం రంగంలో దూసుకుపోతోంది. అయితే జియో ఇటీవల రీచార్జ్ ప్లాన్ ధరలు భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో జియో వినియోగదారులపై మరింతగా భారం పెరిగింది. అయినప్పటికి మంచి నెట్ వర్క్, ఉత్తమ సేవలు అందిస్తున్న జియోను విడిచిపెట్టలేకపోతున్నారు. రీచార్జ్ ప్లాన్స్ ధరలు పెరిగిన తర్వాత కూడా కేవలం రూ.100 లోపు రీచార్జ్ ప్లాన్స్ ను కూడా ఉంది. ఇలా జియోలో అత్యంత చవక రీచార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.


రూ.122 ప్లాన్: జియోలో మరో అతి తక్కువ ప్లాన్ అంటే రూ.122. ఇది ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో 28 రోజుల పాటు 28జిబి ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అంటే రోజుకు 1జిబి చొప్పున నెట్ వస్తుందన్నట్లు. ఇందులో కేవటా డాటా ప్లాన్ మాత్రమే ఉంటుందని గుర్తించుకోండి.

రూ.152 రీచార్జ్ ప్లాన్: మరో చౌక ప్లాన్ గురించి మాట్లాడినట్లయితే రూ.152. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రోజుకు 0.5 జిబి చొప్పున 28 రోజులపాటు 14జిబి ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 300 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి.

రూ.186 రీచార్జ్ ప్లాన్: ఈ రీఛార్జ్ ప్లాన్‌లో 28 రోజులపాటు 28జీబీ ఇంటర్నెట్ డేటా వాడుకోవచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. 28 రోజుల వ్యాలిడిటితో జియో ఫోన్ వినియోగదారుల కోసం ఈ ప్లాన్ ను తీసుకువచ్చింది.