Indian Railways: తరచూ రైలులో ప్రయాణం చేస్తున్నారా.? ఇవి గమనించండి.. లేదంటే.!

Updated on: Jun 30, 2025 | 11:33 AM

తరచూ రైలు ప్రయాణం చేస్తున్నారా.? అయితే మీకోసం ఈ న్యూస్. జూలై 1 నుంచి కొత్తగా మార్పులు రానున్నాయి. ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చే ఆ మార్పులు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి.

1 / 5
ప్రయాణీకులకు సౌలభ్యమైన ప్రయాణాన్ని అందించేందుకు భారత రైల్వే.. తమ సర్వీసులను మరింత సులభతరం చేస్తోంది. ఇందులో భాగంగానే జూలై 1 నుంచి తత్కాల్‌ టికెట్లకు ఆధార్‌ అథంటికేషన్‌ తప్పనిసరి చేయగా.. చార్ట్ ప్రిపరేషన్ కూడా నాలుగు గంటల నుంచి 8 గంటల ముందే సిద్దం చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది.

2 / 5
Train

Train

3 / 5
ముందస్తు చార్టుల తయారీతో పాటు 2025 డిసెంబర్‌ నాటికి అధునాతన ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌-PRS ను తీసుకొచ్చే దిశగా కూడా రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అటు జూలై 1 నుంచి ట్రైన్ టికెట్ ధరలు కూడా స్వల్పంగా మారనున్నాయి.

4 / 5
ఫస్ట్ క్లాస్ ఏసీ రైలు ఛార్జీని కిలోమీటరుకు 0.5 పైసలు పెంచారు. సెకండ్ క్లాస్ ఛార్జీని కిలోమీటరుకు 1 పైసా పెంచారు. స్లీపర్ క్లాస్‌లో కిలోమీటరుకు 1 పైసా పెంచారు. అదేవిధంగా, ఫస్ట్ క్లాస్ ఛార్జీని కిలోమీటరుకు 1 పైసా పెంచారు. రైల్వే ఛార్జీలలో ఇటీవలి మార్పులలో రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్, ఇతర అదనపు ఫీజులలో ఎటువంటి మార్పు లేదు. ఈ ఛార్జీలన్నీ మునుపటిలాగే ఉంటాయి. ఇది కాకుండా ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనల ప్రకారం టికెట్ ధరపై GST విధింపు ఉంటుంది. ఛార్జీల రౌండింగ్ సూత్రాలు కూడా మునుపటిలాగే ఉంటాయి.

5 / 5
500 కిలోమీటర్లు దాటితే కిలోమీటరుకు ఒక పైసా చొప్పున చెల్లించాల్సి ఉంది. అటు దళారులకు దక్కకుండా.. తత్కాల్ టికెట్ల మార్పులు కూడా ప్రయాణీకులకు సౌలభ్యంగా ఉంటుందని రైల్వేశాఖ చెప్పింది.